స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా తెలుగుదేశం పార్టీ
సర్వేపల్లి, మేజర్ న్యూస్ : సర్వేపల్లిలో టీడీపీలోకి చేరికల పరంపర. వైసీపీకి ఇక భవిష్యత్తు లేదని వరుసబెట్టి వీడుతున్న నాయకులు, కార్యకర్తలు. తోటపల్లిగూడూరు మండలం కోడూరు, తోటపల్లి పంచాయతీలకు చెందిన ముఖ్యనాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరిక. అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో కోడూరు, తోటపల్లి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోడూరు పంచాయతీ నుంచి 30 కుటుంబాలు, తోటపల్లి నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరిక. టీడీపీలో చేరిన వారిలో తోటపల్లి నాయకులు తోటపల్లి శ్రీరాములు నాయుడు, అగరం చంద్రబాబు నాయుడు, సుమన్, సీతారామయ్య తదితరులు, కోడూరు నాయకులు దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, తేలిమేటి నాగభూషణం, ఎంబేటి శివరావు, కైలాసం ఏడుకొండలు, తేలిమేటి మల్లికార్జున, నెల్లిపూడి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీధర్ కుమార్ తదితరులు
స్థానిక సంస్థల వేళ వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది. జిల్లాలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కోడూరు బీచ్ రోడ్డు పనులను రూ.4.50 కోట్లతో చేస్తున్నాం. కోడూరు పంచాయతీలోని లింక్ రోడ్ల నిర్మాణాలు జరిగింది మొత్తం టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే ఉప్పుకాలువ మీద బ్రిడ్జి కట్టించింది కూడా మేమే కోడూరు లాంటి మేజర్ పంచాయతీల్లో ముఖ్య నాయకులు చేరడం చాలా సంతోషంగా ఉంది. 2024 ఎన్నికలకు మంచి మెజార్టీ సాధించబోతున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయబోతున్నాం