BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధం..

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల  నిర్వహణకు సర్వసన్నద్ధం..

 

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం,జిల్లాలో మున్సిపల్, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలతో పాటు 30 మండలాల్లోని 910 గ్రామ పంచాయతీలు, 30 జెడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇప్పటికే పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, తొలిరోజు చైర్‌పర్సన్ స్థానాలకు 6, వార్డు సభ్యుల కోసం 78 నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల కోసం ప్రతి మండల కేంద్రంలోనూ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. మొత్తం 16,20,967 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనుండగా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 31,452 మంది, పలాసలో 49,420 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రత్యేక రిటర్నింగ్ అధికారులను (ఏఆర్వో) నియమించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ త్వరగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ముగిసేందుకు ఈసారి కౌంటింగ్ హాల్స్‌ను పెంచినట్లు తెలిపారు.

ప్రచారానికి సభలకు సంబంధించి నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంఆర్ఓల వద్ద, మున్సిపాలిటీల్లో కమిషనర్ల వద్ద సింగిల్ విండో విధానం ద్వారా వెహికల్, ర్యాలీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, కార్యాలయం లోపలికి వెళ్లేందుకు రెండు వాహనాలకు మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేశామని, ప్రకటనల కంటే ముందే అనుమతి పొందాలని కోరారు.
ఎన్నికల వేళ ప్రజలకు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలున్నా, ఫిర్యాదులు చేయాలన్నా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9491222122 కాగా, శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి 9494233490, టెక్కలికి 9704033093, పలాసకు 7386189275 నెంబర్లను కేటాయించామని వెల్లడించారు. అలాగే జిల్లా ఎన్నికల పరిశీలకులను సంప్రదించడానికి 9063575299 నెంబర్ అందుబాటులో ఉంచామన్నారు.

నామినేషన్ కేంద్రాల వద్ద మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా 'మీడియా సెల్' ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని, మీడియా మిత్రులు తమ అక్రిడేషన్ కార్డులను ఐడీ కార్డులుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం అయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల గురించి వివరించారు. ముందస్తుగా పలువురుపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా కూడా ఉన్నారు.