BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులు

 *ఎన్నికలను స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలి

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఏపీ సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

 రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సాధారణ పరిశీలకులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాటించాలని, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోల్ మేనేజ్‌మెంట్ యాప్‌ను రూపొందించిందని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్ల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశీలకులకు సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఓటు హక్కును వినియోగించుకునే సామాన్య పౌరుల వరకు అందరికీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని పేర్కొన్న కమిషనర్, ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు తగిన మార్గదర్శకత్వం అందించడం, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం సాధారణ పరిశీలకుల బాధ్యత అని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు