BREAKING
అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత మాడుగుల్లో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల ఎస్ఎంసి చైర్మన్ పోలవరపు ప్రకాష్ ప్రపంచ గుండె దినోత్సవం వేళ అమలాపురంలో భారీ వాక్‌థాన్: సినీ నటి మెహ్రీన్, ప్రముఖుల సందడి మాడుగుల మండలం లో ప్రశాంతంగా సాగిన ఎస్ఎంసి ఎలక్షన్

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ,స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ… అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి.…

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ,స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ…  అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి.…

 

 

అమలాపురం మేజర్ న్యూస్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం, అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మున్సిపాలిటీల్లో, ముఖ్యంగా అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు.

అమలాపురం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలనను కోరుకునే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆరోపించారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో పాలనా మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఉచిత పథకాల పేరుతో ప్రజలను రాజకీయాలకు కట్టిపడేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రజలు స్వయం శక్తితోఎదిగే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాల్సి గానీ ఉచితాలు కాదన్నారు  మనలను ఎవరో మార్చారు. మనమే మార్పు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు. మున్సిపాలిటీలను అవినీతికి దూరంగా, ప్రజలకు జవాబుదారీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి పాలనలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎటువంటి ఖర్చు లేకుండా బీ-ఫారాలు పొందవచ్చని నాయకులు తెలిపారు. ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలన్నదే తమ పార్టీ విధానమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ మెర్లశాస్త్రులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్లూరి కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి శనివారపు ఫణి, అమలాపురం టౌన్ ప్రెసిడెంట్ సవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.