BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్

Select Suryaa Now
అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్

*కోమన్నోతలలో అక్రమగంజాయి సాగుపై పోలీసుల దాడి.. వెంగముని  అరెస్ట్*

 

లింగాల మేజర్ న్యూస్ :- లింగాల మండలంలోని కోమనూతల గ్రామ పరిధిలో గంజాయి అక్రమ సాగుపై పోలీసులు చర్యలు చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ సెల్క్ నస్కేతన్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, పులివెందుల రూరల్ సీఐ శాంతిలాల్ ఆధ్వర్యంలో లింగాల ఎస్సై డి. జగదీశ్వర్ రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కోమనూతల గ్రామం నుంచి ఎల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామానికి వెళ్లే మార్గంలోని ఎగువ గుట్టపై ఉన్న అరటి తోటలో గంజాయి మొక్కలు అక్రమంగా సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సుమారు 6 అడుగుల ఎత్తు ఉన్న గంజాయి మొక్కతో పాటు ఎండిన గంజాయి ఆకులు పోలీసులకు లభించాయి. ఎండిన గంజాయి ఆకులను తూకం వేయగా సుమారు 750 గ్రాములు ఉన్నట్లు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి మన్నెల నడిపి వేంగముని (63), తండ్రి గంగన్న, బీసీ వాల్మీకి, వృత్తి మేకల కాపరిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై లింగాల పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 59/2026, NDPS Act-1985లోని సెక్షన్ 8(b) r/w 20(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.