BREAKING
తేనేపల్లి తండాను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలి బ్రెక్సిట్ చర్చలకు మళ్లీ తెరతీస్తున్న యూకే నేత ఆండీ బర్హామ్ దొంగల ముఠా అరెస్ట్‌.. 8 తులాల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం ఫ్రాన్స్‌లో ఈడీఎఫ్ సీఈవో భేటీపై వామపక్ష కార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం! సోమాలియా తీరంలో మరో నౌకను రక్షించిన భద్రతా బలగాలు చౌటుప్పల్‌కు రూ.15 కోట్ల అభివృద్ధి వరం బాల్టిక్ దేశాలపై దాడి జరిగితే నాటో నిబంధనల ప్రకారం స్పందిస్తాం పరికరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కుల్కచర్లలో పురాతన ఇంట్లో తవ్వకాలు టిపాజా తీరంలో పడవ మునక, ఇద్దరు మృతి, ఆరుగురు గల్లంతు! ఈయూ విస్తరణకు కొత్త నిబంధనలు గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం,ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు!,అక్టోబర్ 1 నుంచి ఆధార్ లింక్ చేసిన వారికే రాయితీ సిలిండర్ ఆక్రమిత భూములు మాత్రమే తొలగించిన అధికారులు,ఎమ్మెల్యే దామచర్లపై దుష్ప్రచారం మానుకోవాలి. గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత

పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి

Select Suryaa Now
పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి

పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి 

-రేపటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వాలి

-​గతంలోనూ ఈ సమస్యపై  ‘సూర్య’ దినపత్రిక కథనం 

-​హామీ నెరవేర్చకుంటే కార్మికవాడల నిరసన తప్పదు

- సీపీఐ పంతం రవి

 

​సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి

గతంలో పేదలు పోరాడి సాధించుకున్న కార్మిక వాడల  ప్రభుత్వ నివేశ స్థలాలకు వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీవై నగర్ కూడలి జెండా చౌరస్తా వద్ద కార్మికవాడల ప్రతినిధులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​

-గతంలో ‘సూర్య’ కథనాలు ప్రచురించినా స్పందించని పాలకులు

 

సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, తారకరామ నగర్, పద్మనగర్ తదితర కార్మికవాడల్లో సుమారు ఐదు వేల మంది పేదలకు కేటాయించిన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలనే సమస్యపై గతంలోనే ‘సూర్య’ దినపత్రిక “పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలి” అనే శీర్షికతో సమగ్ర కథనాన్ని ప్రచురించి పాలకుల దృష్టికి తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేశారు. పత్రికల్లో కథనాలు వచ్చి సమస్య తీవ్రతను ఎత్తిచూపినా, ప్రజలు నిరంతర పోరాటాలు చేస్తున్నా గత పాలకులు మొద్దునిద్ర వీడలేదని నాయకులు మండిపడ్డారు.

​

-47 ఏళ్లు గడుస్తున్నా అందని హక్కులు

 

ఈ సందర్భంగా పంతం రవి మాట్లాడుతూ, సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత, మరమగ్గాల పరిశ్రమల ఆధారంగా ఉపాధి కోసం అనేకమంది ఇక్కడికి వలస వచ్చారన్నారు. వారి ఇబ్బందులను గుర్తించి ఎర్రజెండా ఆధ్వర్యంలో భూపోరాటాలు, ఆందోళనలు నిర్వహించి నివేశ స్థలాలను సాధించుకోవడం జరిగిందని తెలిపారు. నివేశ స్థలాలు సాధించుకుని 47 ఏళ్లు గడుస్తున్నా పాలకులు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు

 

- బ్యాంకు రుణాలు రాక తీవ్ర ఇబ్బందులు

 

రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడంతో ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే.. ఆ స్థలాలకు విలువ లేదంటూ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు తమ స్థలాలను విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గతంలో ఈ సమస్యపై ఉద్యమాలు చేపట్టినప్పుడు స్థానిక శాసనసభ్యుడు కేటీఆర్ ప్రత్యేక ఉత్తర్వులు (జీవో) తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే పాత పట్టాల స్థానంలో కొత్త పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రజలను మభ్యపెట్టారే తప్ప, నేటికీ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించలేదని విమర్శించారు.

​

-సభలో హామీ ఇవ్వకుంటే ఆందోళన తప్పదు

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జరిగే బహిరంగ సభలో నివేశ స్థలాల రిజిస్ట్రేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహిరంగ సభలోనే కార్మికవాడల ప్రజల నిరసనను ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికవాడల ప్రతినిధులు నంది శంకరు, మిట్టపల్లి రాజమల్లు, భోగ వెంకటేశం, గుజ్జ నాందేవ్, మోర రవి, కొండ ప్రతాపు, దేవనపల్లి రామకృష్ణ, సోమ నాగరాజు, నల్ల మార్కండేయులు, దాసరి వెంకటేశం, మామిడాల రమణ తదితరులు పాల్గొన్నారు.