BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

ఎస్ఎంసి చైర్మన్ పోలవరపు ప్రకాష్

Select Suryaa Now
ఎస్ఎంసి చైర్మన్ పోలవరపు ప్రకాష్


* భోగాపురం ఏపీ మోడల్ స్కూల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు
* రాజకీయాలకు చోటు లేకుండా సభ్యుల నియామకం

భోగాపురం, సెప్టెంబర్ 29,(మేజర్ న్యూస్):

భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో, రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాలలో ఏ కార్యక్రమం నిర్వహించినా అందరి సహకారంతో స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎస్‌ఎంసీ ఎన్నికలను కూడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పార్వతి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో చైర్మన్‌గా పోలవరపు ప్రకాష్, వైస్ చైర్మన్‌గా కె.వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి నూతన కమిటీ బాధ్యతలను చేపట్టారు.
* పాఠశాల అభివృద్ధిలో ప్రకాష్ ప్రత్యేక ముద్ర
కొత్తగా చైర్మన్‌గా ఎన్నికైన పోలవరపు ప్రకాష్‌కు పాఠశాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఎస్‌ఎంసీ సభ్యునిగా పనిచేసిన ఆయన పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేసిన కృషి పలువురి ప్రశంసలు అందుకుంది. పాఠశాల అభివృద్ధిపై అవగాహన, సమస్యల పరిష్కారంపై చొరవ, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ప్రకాష్‌ను చైర్మన్‌గా ఎన్నుకోవడం పట్ల పాఠశాల వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.
ప్రకాష్ పేరు ప్రకటించగానే పాఠశాల ప్రాంగణంలో హర్షధ్వానాలు మార్మోగడం ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. నూతన కమిటీతో పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆకాంక్షను పలువురు వ్యక్తం చేశారు.
* ప్రశాంత వాతావరణానికి ప్రిన్సిపల్ పార్వతి కృషి
ఎన్నికల ప్రక్రియను ఎలాంటి రాజకీయ, వర్గ విభేదాలకు తావులేకుండా సజావుగా నిర్వహించడంలో ప్రిన్సిపల్ పార్వతి కీలకంగా వ్యవహరించారు. పాఠశాలలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ, విద్యార్థుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అందరినీ సమన్వయం చేస్తూ ఎస్‌ఎంసీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంపై పాఠశాల వర్గాలు అభినందనలు తెలిపాయి.
నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని, విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.