గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
పూసపాటిరేగ, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్: బోగాపురం ఎక్సైజ్ శాఖ పరిధిలో పూసపాటిరేగ మండలంలోని అనధికారిక మద్యం దుకాణాలపై ఎక్సైజ్ శాఖ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం దాడులను నిర్వహించారు.
దాడుల్లో భాగంగా గొల్లపేట గ్రామ పరిధి పూసపాటిరేగ మండలం లో ఒక ఆడ ఆసామి ని 49 మద్యం 180 ఎమ్మెల్ పరిమాణం గల సీసాలతో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
ఎవరైనా అనధికారిక మధ్యo దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించిన, ప్రోత్సహించిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనధికారి మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) యొక్క సమాచారాన్ని భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వారికి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని సీఐ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో సిఐ వి. రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్, సత్యనారాయణ, కానిస్టేబుల్ సూర్యనారాయణ, శిరీష లు పాల్గొన్నారు.