కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు
కనిగిరి ,మేజర్ న్యూస్ :నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం జరిగిన పల్లె పండుగ 3.O లో సీఎం చంద్రబాబు నాయుడు కనిగిరి నియోజకవర్గం పై వరాల జల్లు కురుపించారు .కనిగిరి ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలోని ప్లోరైడ్ సమస్య ,ట్రిపుల్ ఐటీ నిర్మాణం ,గ్రామీణ ప్రాంత రహదారులు అభివృద్ధి ,వెలిగొండ ప్రాజెక్టు సాగునీరు తదితర సమస్యలను సీఎం ,డిప్యూటీ సీఎం లకు వినతి పత్రాలను అందజేశారు .ఈ సంధర్భంగా కనిగిరి మండలం
బల్లిపల్లి వద్ద 1000కోట్లతో నిర్మిస్తున్న ట్రిపుల్ ఐటీ భూమి కొనుగోలు చేసి బిల్డింగ్ నిర్మించి పూర్తి చేస్తామని ఆలాగే కనిగిరి నియోజకవర్గంలోని 189 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు 100 కోట్ల నిధులతో విముక్తి కల్పిస్తామని ,2028 కి వెలిగొండ రెండవ దశ పూర్తి చేసి కనిగిరి నియోజకవర్గంను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు . కనిగిరి నియోజకవర్గంలోని గ్రామాల బీటి రోడ్ల పునఃనిర్మాణానికి విబిజి రాంజీ పధకంలో అడిగారు అది తప్పకుండా కన్సిడర్ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు .ఈ సందర్భంగా సీఎం ,డిప్యూటీ సీఎం లకు ఎమ్యెల్యే కృతఙ్ఞతలు తెలియజేశారు .