లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల
పరవాడ, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్.
లంకెలపాలెం గ్రామంలో శనివారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం బాధితులు చికిత్స పొందుతున్న మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం, ఇతర సాయం అందేలా కమిటీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు సుందరపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.ప్రమాద ఘటనపై స్థానికంగా వివిధ వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. బాధితులు త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.