స్థానిక' ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి --ఎంపీ పుట్టా మహేష్, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, మేజర్ న్యూస్ :పనిచేసే సమర్థత కలిగిన కూటమి అభ్యర్ధులకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు విజయాన్ని కట్టబెట్టాలని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. గడిచిన రెండేళ్ళలో ఒక్క ఏలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూటమి ప్రభుత్వ సువర్ణపాలనకు నిదర్శనమంటూ వారు వ్యాఖ్యానించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పరంపరం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇదేక్రమంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం ద్వారా మరికొన్ని రహదారుల నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. 40లక్షల రూపాయల వ్యయంతో ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలోని రోడ్డు, కోటి, 20లక్షల రూపాయలతో వంగాయగూడెం సెంటర్ సుబ్రహ్మణ్యం కాలనీ రోడ్డు, 80లక్షల రూపాయలతో బూరాయిగూడెంలోని రోడ్డు, కోటి, 83లక్షల రూపాయలతో నిర్మించనున్న శనివారపు పేట ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ రోడ్‌ల పనులకు శంకుస్థాపనా కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. పూలవర్షం కురిపిస్తూ స్థానికులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాను ఎంపి పుట్టా, ఎమ్మెల్యే బడేటి, ఆర్టీసీ జోన్ ఛైర్మన్ అప్పలనాయు డు ఆవిష్కరించారు. తదనంతరం స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ సమర్థత కలిగి నాయకత్వమే అభివృద్ధిని చేతల్లో చూపించగలదనే విషయాన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి రుజువు చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇదేక్రమంలో ఏలూరు పార్లమెంట్ పరిధితో పాటూ రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వాధినేతల సారథ్యంలో ప్రగతిపథంలో నడుస్తోందని ఆయన వెల్లడించారు. ఈ అభివృద్ధే తిరిగి రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చనుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఒకపక్క రహదారుల నిర్మాణం, మరోపక్క మౌళిక వసతుల కల్పన, ఇంకోపక్క సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోన్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. స్థానికుల కోరిక మేరకు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన స్పెషల్ గ్రాంట్స్ కోటి రూపాయల నిధుల నుండి రాజా కాలనీ, మరడాని రంగారావు కాలనీల్లో రహదారుల నిర్మాణానికి 30లక్షల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు స్థానికుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు. ఇదేక్రమంలో విలీనమైన గ్రామల ప్రజలకు 2027 డిసెంబర్ నాటికి గోదావరి జలాలను త్రాగునీరుగా అందించేందుకు శాశ్వత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, కూటమి నాయకత్వానికి మరింత వేగం పెంచేలా రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో గంపగుత్తుగా ఓట్లన్నీ కూటమి పార్టీల అభ్యర్థులకే వేయాలంటూ పిలుపునిచ్చారు. ఆర్టీసీ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసిన కూటమి నాయకత్వానికి స్థానిక ఎన్నికల్లో ప్రజలు మరోసారి జైకొట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరి బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు,టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, ఆర్ ఎన్ ఆర్ నాగేశ్వరరావు, గూడవల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఎర్రం శెట్టి నాగబాబు, జి. శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ అంబటి లావణ్య, డివిజన్ ఇంచార్జిలు పూజారి నిరంజన్, పైడి పార్వతి, గరికిముక్కు వీరాంజనేయులు, సోమిశెట్టి రాము, కడియాల విజయలక్ష్మి, చేకూరి గణేష్, జనసేన డివిజన్ ఇన్చార్జిలు డి.రాజు,విజయ్, లోవరాజుడివిజన్ ప్రెసిడెంట్ సుంకర మురళి, డివిజన్ కో ఇంచార్జ్ లు మాకాల రమేష్, అంబటి రజిని, నందారపు రాధా, మట్ట శ్రీను మరియు కూటమి పార్టీల నాయకులు పెద్దాడ వెంకటరమణ నేరుసు రాము, కాకర్ల కుమార్, చిన్ని అర్జున్ రావు, బొమ్మిడి సత్యనారాయణ, గడికిముక్కు మల్లికార్జునరావు, కోనేరు శ్రీధర్, లంక రాజబాబు, మట్ట రంజిత్, బయ్యారపు కుటుంబరావు, కడిమి రమేష్, చాంద్ బాషా వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో కే బాల సౌరి ఏలూరు