BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి -ఎమ్మెల్యే, పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి -ఎమ్మెల్యే, పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్

ఆమదాలవలస, అక్టోబర్ 17, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మండలంలో స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మండల నాయకులు, పార్టీ కార్యకర్తలతో ఆమదాలవలస ఎమ్మెల్యే,రాష్ట్ర పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ శనివారం కార్యకర్తలతో కొర్లకోట సమీపంలో కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడంపై చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరున జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు  పటిష్ఠమైన కార్యాచరణతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్రావు, బిజెపి ఇన్చార్జ్ పేడాడ సూరపునాయుడు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్,  తమ్మినేని సుజాత, నూక రాజు, సనపల డిల్లేశ్వరరావు, తమ్మినేని నాని, ఎండ అప్పలనాయుడు, గోండు రమణమూర్తి, తమ్మినేని లక్ష్మీనారాయణ, కార్యకర్తలు, టిడిపి అభిమానులు పాల్గొన్నారు.