సూర్య పీఠంలో పండిత సత్కారం
పార్వతీపురం, సూర్య : సహస్ర చండి యజ్వ అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ కి, సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యులు సుసారపు గణపతి శర్మలకు శ్రీ సూర్యపీఠం సౌర యజ్ఞశాలలో అశేషశేముషీనిధి బ్రహ్మ శ్రీ వేమకోటి నరహరి శాస్త్రి స్వామి వారి శేషవస్త్రం, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామి వారికి క్షీరాభిషేక కార్యక్రమములో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత దేశంలోనూ, ప్రపంచ దేశాల్లోనూ మారుతున్న పరిస్థితులు మానవాళికి, ప్రాకృతిక, పాలకులకు, వివిధ జీవ జాతులకు, పర్యావరణానికి ఎదురవుతున్న వివిధ ఆధ్యాత్మిక, భౌతిక, ప్రకృతిక, ఆరోగ్య సంబంధ మరియు కర్షక, కార్మిక, శ్రమ జీవుల ఈతి బాధల గూర్చి శ్రీ శాస్త్రి తో ఇరువురూ చర్చించారు. పరిష్కార మార్గాలను సనాతన ధర్మములో గల నివారణోపాయాలను దేవతానుగ్రహ ప్రాప్తికై ఆచరించవలసిన కర్మానుష్ఠానముల గూర్చి చర్చించారు. గత 3 దశాబ్దాల పైచిలుకు సూర్యపీఠం ప్రాంగణంలో నిర్వహించబడుతున్న కార్యక్రమాలను తెలుసుకొని వారి సంతోషాన్ని వ్యక్త పరిచారు. సద్గురు కృష్ణ యాజి గారితో గల అనుబంధాన్ని స్మరించుకున్నారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం.