సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో సంపత్ వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు
లక్కవరపుకోట, సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : సంకటహర చతుర్థి, మంగళవారం సందర్భంగా లక్కవరపుకోట మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సంపత్ వినాయక స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితులు అక్కాజోస్యుల శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సంగం వీధిలోని గ్రామదేవత శ్రీ పట్టాలమ్మ తల్లికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.