శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సాయి దంపతులు
సింహాద్రిపురం మేజర్ న్యూస్:
సింహాద్రిపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు స్వామివారు వామనావతారంలో కల్పవృక్ష వాహన పల్లకిపై విహరించనున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ఉభయదారులుగా డాక్టర్ సాయి, శ్రీమతి అశ్విని దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు విజయ రంగనాయకులు స్వామివారికి పంచామృత అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయి దంపతులకు అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా