BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం అవసరం

Select Suryaa Now
శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం అవసరం

పాలకొండ, సూర్య : అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పాలకొండ మండలం అన్నవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో  ఏపీ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ - గుంటూరు వారి సౌజన్యంతో, పాలకొండ జన చేతన సంస్థ ఆధ్వర్యంలో  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుజన్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ రోజును జరుపుకుంటారు. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్  పిలుపు మేరకు 1992 నుండి అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినం గా ఈ దినోత్సవం ప్రారంభమైందని అన్నారు. మానసిక ఆరోగ్యం అంటే కేవలం పిచ్చితనం లేదా మానసిక జబ్బులు లేకపోవడం మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రించు కుంటూ, సమాజంలో బాధ్యతాయుతంగా మెలగడం, ఒత్తిడిని తట్టుకోగలగడం దీని కిందికి వస్తాయని పేర్కొన్నారు. సమస్యలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలని, అవసరమైతే సైకాలజిస్ట్ ల సహాయం తీసుకోవాలని సూచించారు. జన చేతన కోఆర్డినేటర్ ఎం. సరస్వతి మాట్లాడుతూ  ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో మానసిక సమస్యలు బాగా పెరిగిపోతున్నాయన్నారు. చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రమైన ఒత్తిడి, సోషల్ మీడియా వాడకం పెరిగి, మనుషుల మధ్య ప్రత్యక్ష బంధాలు తగ్గడం వల్ల ఒంటరితనం పెరుగుతోందని పేర్కొన్నారు. హెచ్ వీ ఆర్. వరలక్ష్మి మాట్లాడుతూ శారీరక జబ్బు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లే ప్రజలు, మానసిక సమస్య వస్తే పిచ్చి అనుకుంటారనే భయంతో ఆ రోగాన్ని దాచిపెడుతున్నారని అన్నారు. నిరంతరం యోగా, ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని,  సరైన నిద్ర, పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమం లో ఏ ఎన్ ఎం రమణమ్మ, ఆశా వర్కర్ కె. సీతాలక్ష్మి, వి. ప్రసాదరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.