BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

సర్వేపల్లిలో టిడిపి ఖాళీ - కాకాణి"

Select Suryaa Now
సర్వేపల్లిలో  టిడిపి ఖాళీ - కాకాణి"

వెంకటాచలం , మేజర్ న్యూస్  :నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో ,వెంకటాచలం మండలం, కురిచర్లపాడు పంచాయతీ, ఇస్లాంపేటకు చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు

తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కాకాణి


మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ..

అధికారం వదలుకొని ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి లో చేరడం శుభ సూచికమన్నారు, రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి ఖాళీ కాబోతుందని జోస్యం చెప్పారు

స్థానిక ఎన్నికలలో  నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్లు, చైర్మన్లు మరియు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్‌ ,వార్డులతో సహా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పోలీసుల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు

తాము వేరే పార్టీలోకి మారినట్లు వార్తలు రావడంతో మనస్థాపం చెంది తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకుని పార్టీలోకి తిరిగి రావడం జరిగిందని పార్టీలో చేరిన వారు చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
సర్వేపల్లిలో తెలుగుదేశం దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరచడంతో దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం వారికి కండువాలు కప్పి చేరికల పేరిట డ్రామాలు ఆడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
తెలుగుదేశం పార్టీని వీడి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ,చేర్పించిన స్థానిక నాయకులకు కాకాణి ధన్యవాదాలు తెలియచేశారు