BREAKING
శివ శంకర కాలనీ, టీచర్స్ కాలనీలో టీడీపీ ఎన్నికల ప్రచారం. షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భారత్ - న్యూజిలాండ్ నాలుగో వన్డే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కీలక మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా! యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం గ్రీన్‌ఫీల్డ్ వేదికగా అట్టహాసంగా 'ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్' టోర్నీ.. ఉత్కంఠభరితంగా ప్రారంభమైన పోటీలు! పంజాబ్ కింగ్స్‌లోకి మారిన తర్వాత హార్దిక్ పాండ్యా తొలి రియాక్షన్.. శ్రేయస్, పాంటింగ్‌లకు మద్దతుగా సంచలన పోస్ట్! కివీస్ గడ్డపై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడింగ్ వేళ డబుల్ ధమాకా! అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా.. సనత్ జయసూర్య సరసన చోటు! యశస్వి జైస్వాల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ డిమాండ్లు! యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ

సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి * ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ *

Select Suryaa Now
సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి  * ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ *

విశాఖపట్నం, సూర్య : ఈ నెల 12, 13 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర సంబంధిత అధికారులు, సీఐఐ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక వద్ద చేపడుతున్న మౌలిక సదుపాయాలు, అతిథులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా, పార్కింగ్, భద్రత, పారిశుధ్యం తదితర ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు, సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడి నుంచి వివిధ శాఖల మధ్య జరుగుతున్న సమన్వయం, అందిస్తున్న సేవలు, ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించిన విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.