సచివాలయ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలి.... హెల్త్ సెక్రటరీల డిమాండ్
విశాఖపట్నం, అక్టోబర్ 12, మేజర్ న్యూస్: సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తిగా వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలని, అనవసరమైన యాప్స్ పని భారం తగ్గించాలని యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు జి. సుభాషిణి, గౌరవ అధ్యక్షురాలు పి. మణి అధ్యక్షత్వంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లోని పీఎంఆర్‌ఎస్‌లో సామూహికంగా వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛవార్డు, స్వచ్ఛ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను పూర్తిగా వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలని వారు కోరారు. యాప్స్ సంఖ్యను తగ్గించి పనిభారం తగ్గించాలని, వివిధ ఆరోగ్య కార్యక్రమాల సర్వీసులను ఓటీబీతో సంబంధం లేకుండా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్బీఎస్‌కే, అనోల్, యూ-విన్ తదితర యాప్స్‌లో ఒకే సమాచారాన్ని పదేపదే నమోదు చేయాల్సి వస్తోందని, దీనికి బదులుగా ఒకే యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆ యాప్‌లో ఎడిట్, డిలీట్ ఆప్షన్లు కూడా కల్పించాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో టార్గెట్ విధానాన్ని తొలగించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఎఫ్ఎల్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీపీఎంను రద్దు చేసి ఓపీఎంను పునరుద్ధరించాలని, ఎంఎల్‌హెచ్‌పీ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వేలో ఓటీబీ విధానం నుంచి సడలింపు కల్పించాలని కోరారు. ప్రిన్సిపల్ ఆర్డర్—2025ను కారణంగా చూపుతూ ప్రమోషన్లు నిలిపివేయకుండా అన్ని కేడర్లకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.