BREAKING
జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు గోడౌన్ల వద్ద ప్రతిష్ట భద్రతా చర్యలు --- కలెక్టర్ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

Select Suryaa Now
సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

జంగారెడ్డిగూడెం సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

-- రికార్డులు స్వాధీనం చేసుకుని సిబ్బంది విచారణ

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్ : సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ తన తల్లికి రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్‌ సొమ్ముకు సంబంధించిన వ్యవహారంలో సబ్‌ ట్రెజరీ అధికారులను పలుమార్లు సంప్రదించినట్లు సమాచారం. ఈ సొమ్ము నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించేందుకు అధికారులు రూ.2.50 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.లంచం ఇచ్చేందుకు ఇష్టపడని సదరు మహిళ ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ఏలూరు ఏసీబీ డీఎస్పీ జి.వి. కృష్ణారావు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు ఎం. బాలకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు గురువారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం సబ్‌ ట్రెజరీ కార్యాలయానికి చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించడంతో పాటు కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏటీవో చంద్రయ్య, ఎస్టీవో చిన్నబాబు, సీనియర్‌ అకౌంటెంట్‌, ఇతర సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం.తనిఖీల అనంతరం మీడియా ప్రతినిధులు ఏసీబీ డీఎస్పీ జి.వి. కృష్ణారావును వివరాలు అడగ్గా, ప్రస్తుతం ఈ విషయంపై తాను వివరాలు వెల్లడించలేనని తెలిపారు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయం నుంచి మీడియాకు అధికారిక సమాచారం అందిస్తారని పేర్కొన్నారు.

 

 కె.వి.రమణరావు జంగారెడ్డిగూడెం రిపోర్టర్