రేణిగుంటలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
రేణిగుంట మేజర్ న్యూస్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.