BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

రెగ్యులర్ లైబ్రేరియన్ లేని ఆత్మకూరు గ్రంథాలయం --15 సంవత్సరాలుగా ఇన్చార్జి తోనే

Select Suryaa Now
రెగ్యులర్ లైబ్రేరియన్ లేని ఆత్మకూరు గ్రంథాలయం      --15 సంవత్సరాలుగా ఇన్చార్జి తోనే

  ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖ గ్రంధాలయం  ఒకటిన్నర దశాబ్ద కాలంగా రెగ్యులర్ లైబ్రరియన్ లేకుండానే ఇన్చార్జితోనే కొనసాగిస్తున్నారు. నూతనంగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా ఆత్మకూరు నియోజకవర్గంకు చెందిన మేకపాటి శాంతికుమారి బాధ్యతలు స్వీకరించినందున ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపి ఆత్మకూరు గ్రంధాలయానికి రెగ్యులర్ లైబ్రేరియను నియమించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అనాదిగా లైబ్రేరియన్ లేని విషయాన్ని ఆమె పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2009లో ఇక్కడ లైబ్రరీయన్ గా పనిచేస్తున్న ఏ గోవిందరెడ్డి రిటైర్ అయ్యారు.నాటినుండి ఓంకారం శ్రీనివాసరాజు అనే లైబ్రరీయను  ఆత్మకూరు గ్రంధాలయ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.రెవిన్యూ డివిజన్ కేంద్రం, నియోజకవర్గ కేంద్రం,వివిధ శాఖల డివిజన్ కేంద్రంగా, మండల కేంద్రంగా కొనసాగుతున్న ఆత్మకూరులో గ్రంధాలయానికి గ్రంధ భాండాగారి లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. దశాబ్దాల తరబడి ఆత్మకూరు గ్రంధాలయానికి స్వంత భవనం లేకుండా అద్దె భవనంలో కొనసాగుతుండగా  ఐదేళ్ల క్రితం స్థానిక ఇందిరాగాంధీ మహిళా మండలి భవనాన్ని ఆ భవన నిర్వాహకులు గ్రంధాలయానికి అప్పగించారు. లైబ్రరియన్ మాత్రం ఇన్చార్జిగా శ్రీనివాసరాజును కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరాజు విధుల నిర్వహణలో అత్యంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంటారు. ఆయనను నియమించాలని పలువురు కోరుతుండగా  ఆత్మకూరు గ్రంధాలయం బి కేటగిరిలో ఉందంటున్నారు. డివిజన కేంద్రంగా అనేక కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటుపరంగా దాదాపు 30 విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీ,పాలిటెక్నిక్,ఐటిఐ, గురుకుల పాఠశాల తదితర ప్రత్యేక విద్యాసంస్థలు ఉండగా ఆత్మకూరు గ్రంథాలయాన్ని ఏ కేటగిరిగా మార్చకపోవడం విశేషం. అదిగాక ఆత్మకూరు గ్రంధాలయంలో వేలకొద్దీ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు అవసరమైన అన్ని పుస్తకాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50శాతం లైబ్రరీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వం, నూతన చైర్పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఆత్మకూరు గ్రంథాలయాన్ని ఏ గ్రేడ్ గా మార్చాలని రెగ్యులర్ లైబ్రరీయన్ ను నియమించేలా చర్యలు తీసుకోవాలని సర్వత్ర కోరుతున్నారు.