BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

రక్తదానం చేద్దాం ప్రాణదాతలువుదాం.

Select Suryaa Now
రక్తదానం చేద్దాం ప్రాణదాతలువుదాం.
  • ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు.

సాయి సేవలో 162 యూనిట్ల రక్త సేకరణ.

ఇది నా సర్వీస్ లో అతిపెద్ద క్యాంప్ - డాక్టర్ సునీత.

పలాస, అక్టోబర్ 2, మేజర్ న్యూస్.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ముగింపు వేడుకలలో భాగంగా,గాంధీ జయంతిని పురస్కరించుకుని పలాస మండలం, రామకృష్ణాపురం,శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.స్థానిక ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో,టెక్కలి జిల్లా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో ఏకంగా 162 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం.

సేవలోనే ఆనందం ఉంది - ట్రస్ట్ చైర్మన్

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు మాట్లాడుతూ, స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ కేవలం ఉన్నత విలువలతో కూడిన విద్యనే కాకుండా, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ, నారాయణ సేవ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

ఇదే నా సర్వీసులో అతిపెద్ద క్యాంప్ - డా. సునీత

మెడికల్ ఆఫీసర్ డా. సునీత మాట్లాడుతూ, రక్తదానం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, తన సర్వీసులో ఇదే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఆమె కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తాళాసు శ్రీను, గవర్నింగ్ బాడీ మెంబర్ శరత్, ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి, ఉపాధ్యాయులు అనుదీప్, మురళి, జోనల్ కన్వీనర్ బైరాగి మాస్టర్, సబ్ జోనల్ కన్వీనర్ నాగేశ్వరరావు, పలాస-కాశీబుగ్గ సమితి కన్వీనర్లు ఇప్పిలి తిరుమల, నాగరాజు, గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్, కొంచాడ నూకరాజు, విజయలక్ష్మి, జామి శ్రీను, పొట్నూరు శ్రీనివాస్, కుర్మారావు, రంగాచారి తదితరులు పాల్గొన్నారు.