రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టంకశాల హనుమంతు నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం (రాయదుర్గం ఇన్చార్జ్, రాయదుర్గం) : రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా టంకశాల హనుమంతు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, యువ నాయకుడు కాలవ భరత్, టీడీపీ నాయకులు జిలాన్ భాష, పూజారి శివ, వాల్మీకి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా టంకశాల హనుమంతు నామినేషన్ దాఖలు చేయడంతో రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శివప్రసాద్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.