BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

రావులపాలెం పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛంద అవార్డు

Select Suryaa Now
రావులపాలెం పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛంద అవార్డు

రావులపాలెం పంచాయతీ కార్యదర్శికి స్వచ్చాంద్రా అవార్డు

సిఎం చంద్రబాబు చేతులమీదుగా

రావులపాలెం మేజర్ న్యూస్

రావులపాలెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంద్ర అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీ,మున్సిపాలిటీ తదితర విభాగాలకు  ఈ అవార్డులను అందజేశారు. ఇంటింటికి చెత్త సేకరణ, అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ తదితర విషయాల్లో ఈ పంచాయతీకి అవార్డు దక్కింది.  అంతేగాక ఎప్పటికప్పుడు  సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తడిపొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 12 గ్రామపంచాయతీలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రావులపాలెం గ్రామ పంచాయతీ దక్కింది.కార్యదర్శి దుర్గాప్రసాద్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారిణి డి‌ శాంత లక్ష్మిలు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.