BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా గంగు డిల్లేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా గంగు డిల్లేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక

 

శ్రీకాకుళం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలేజ్ రెవెన్యూ అధికారుల సంఘం (APRSA), ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గంగు డిల్లేశ్వరరావు ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విజయవాడలో శుక్రవారం జరిగిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సరుబుజ్జిలి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న గంగు డిల్లేశ్వరరావు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల శ్రీకాకుళం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి, జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ భైరి రాజు, మహిళా విభాగం చైర్‌పర్సన్ కె. ప్రవల్లిక ప్రియ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, APRSA రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. APRSA జనరల్ సెక్రటరీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఎన్నికల కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి. రాజేష్ కుమార్, జిల్లా కార్యదర్శి బి. రాంజీతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.