BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

రాష్ట్ర పోటీల్లో జయకేతనం ఎగురవేయండి

Select Suryaa Now
రాష్ట్ర పోటీల్లో జయకేతనం ఎగురవేయండి

 

* సాఫ్ట్ బాల్ అసోసియేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపు

* రాష్ట్రస్థాయి పోటీలకు వైయస్సార్ కడప జిల్లా పయనమైన జిల్లా జట్లు 
* క్రీడాకారులకు కోచ్ లకు క్రీడా దుస్తులను సమకూర్చి, పంపిణీ చేసిన సూర శ్రీను 
 

శ్రీకాకుళం 

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియ పోటీల్లో సమిష్టిగా రాణించి విజయదుందుభి మోగించాలని సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వైయస్సార్ కడప జిల్లా పుల్లంపేట వేదిక ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాల బాలికల సాఫ్ట్‌ బాల్ ఛాంపియన్ షిప్ -2026 పోటీల్లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా జట్లు ఆదివారం సాయంత్రం ఇక్కడి నుంచి పయనమై వెళ్లాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా డి.ఎస్.డీ.ఓ. ఏ.మహేష్ బాబుతో కలిసి సూర శ్రీను మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలంగా సాఫ్ట్ బాల్ లో శ్రీకాకుళం జట్లు అత్యద్భుతమైన ఆటతీరును, ఫలితాలను  సాధిస్తున్నాయని చెప్పడానికి గర్వకారణంగా ఉందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లా జట్లు విజేతలుగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

శిక్షణా శిబిరాలు నిర్వహించి తీర్చిదిద్దాం.. 
జిల్లాలో నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా జట్లకు పది రోజులు పాటు రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలు అందించి, రాష్ట్ర పోటీల్లో రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దినట్లు సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ వెల్లడి చేశారు. జిల్లాలో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు సాధించిన పురోగతి ప్రగతి, ఫలితాలను ఆయన వివరించారు. రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్లు సమిష్టిగా రాణించి జయకేతనం ఎగురవేయాలని వక్తలు ఆకాంక్షించారు. అంతకుముందు జిల్లా బాలబాలికలు జట్లు, కొచ్ మేనేజర్లకు కలిపి 40 మందికి రూ. 15వేలకు పైగా విలువ చేసే క్రీడా దుస్తులను, మరో 20వేలు వరకు రానుపోను ఖర్చుల కోసం ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ తరుపున సూర శ్రీనివాసరావు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, అన్నెపు రాజగోపాల్, డాక్టర్ పాతిన రమేష్ బాబు, వెంకటరమణ, కోచ్ లు గౌరీ, శివ సీనియర్ క్రీడాకారులు క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.