రామాపురం సభకు తరలివెళ్లే కూటమి శ్రేణులకు భోజన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర
పామూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని రామాపురంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ -3.0 బహిరంగ సభకు తరలివెళ్తున్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల కోసం పామూరు పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భోజన వసతులను ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పరిశీలించారు. సభకు వెళ్లే నాయకులు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొనే రామాపురం బహిరంగ సభకు తరలివెళ్తున్న కూటమి శ్రేణులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పామూరు మండలం మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, యాదాల వెంకట సాయి కిరణ్, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, సయ్యద్ అమీర్ బాబు, షేక్ గౌస్ బాషా, కాజా రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.