BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

రాజకీయ ఫ్లెక్సీలు, విగ్రహాలు, శిలాఫలకాలకు ముసుగులు..

Select Suryaa Now
రాజకీయ ఫ్లెక్సీలు, విగ్రహాలు, శిలాఫలకాలకు ముసుగులు..


- ఎన్నికల నియమావళి అమలుపై డిప్యూటీ ఎంపీడీవో ఆదేశాలు.

నరసన్నపేట  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని నరసన్నపేట డిప్యూటీ ఎంపీడీవో పిల్లా జగన్మోహనరావు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడంతో పాటు, రాజకీయ ప్రచారానికి సంబంధించిన శిలాఫలకాలను కప్పివేయాలని ఆదేశించారు.ఈ మేరకు గ్రామ సచివాలయాల కార్యదర్శులు, సంబంధిత ఉద్యోగులు ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యం వహించకుండా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎక్కడా ఉల్లంఘనకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల నియమావళి అమలుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని డిప్యూటీ ఎంపీడీవో కోరారు.నరసన్నపేట మండలంలోని అన్ని గ్రామాలతో పాటు నరసన్నపేట పట్టణంలోనూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.