BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ.

Select Suryaa Now
రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ.

 

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, జిల్లాలో జరగనున్న మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో, కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో "ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ప్రక్రియ" పై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. అభ్యర్థులు సభలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులపై రాతలు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషిద్ధమని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.పట్టణ స్థానిక సంస్థలు, జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరు తేదీలను నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వెలువడుతుందని, అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు ఉంటాయని వివరించారు. ఎన్నికల కోడ్ అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను రంగంలోకి దించినట్లు కలెక్టర్ వెల్లడించారు.పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలను సరిగ్గా పూరించాలని కలెక్టర్ సూచించారు.నామినేషన్ల చివరి రోజు మినహా మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేస్తూ, తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ఒకరోజు ముందే హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి పరిశీలించుకోవాలని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల వెలుపలే వాహనాలను నిలిపివేయాలని, అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని అన్నారు. అభ్యర్థులందరూ ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి లోబడే ఖర్చు చేయాలని, వ్యయ నిబంధనలు మించకూడదని ఆదేశించారు.జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే ప్రాంతంలో రెండు వేర్వేరు పార్టీలు ప్రచారం చేయకుండా పోలీసు ముందస్తు అనుమతితో వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, జడ్పీ సీఈవో వెంకటరామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప రాణిలతో పాటు వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పీఎంజే బాబు (టీడీపీ), రౌతు శంకరరావు, ఐటీ కుమార్ (వైసీపీ), అర్జున్ కుమార్ (జనసేన), సురేష్ సింగ్ (బీజేపీ), కే.ఎల్.ఎస్. ఈశ్వరి (కాంగ్రెస్), లాసా సోమేశ్వరరావు (బీఎస్పీ), గోవర్ధనరావు (సీపీఎం),  ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.