BREAKING
అనంతపురం నగర అభివృద్ధికి రూ.3.84 కోట్లతో పనులకు శ్రీకారం 30–40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం!

పుట్టగుంట ‘బుడమేరు’ వంతెనకు రూ. 100 కోట్లు మంజూరు: దశాబ్ద కాలపు కష్టాలకు మోక్షం!

Select Suryaa Now
పుట్టగుంట ‘బుడమేరు’ వంతెనకు రూ. 100 కోట్లు మంజూరు: దశాబ్ద కాలపు కష్టాలకు మోక్షం!

పుట్టగుంట ‘బుడమేరు’ వంతెనకు రూ. 100 కోట్లు మంజూరు: దశాబ్ద కాలపు కష్టాలకు మోక్షం!

నందివాడ- సూర్య ప్రతినిధి :
కృష్ణా - ఏలూరు జిల్లాల ప్రజల దశాబ్దాల నాటి చిరకాల కల ఎట్టకేలకు ఫలించింది. నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు ఏటిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఎన్హెచ్ ఆర్అండ్బీ ఏఈ శరత్ చంద్ర తెలిపారు. నిధులు విడుదల కావడంతో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.
నిజానికి పదేళ్ల క్రితమే మచిలీపట్నం - నూజివీడు - కల్లూరు(ఎమ్ఎన్కే) రహదారి అభివృద్ధిలో భాగంగా ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రూ. 300 కోట్ల నిధుల్లోనే వంతెన కట్టాల్సి ఉన్నా.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో పనులు చేయక వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఏటా వర్షాకాలంలో బుడమేరు పొంగిపొర్లి రోజుల తరబడి ఏపీ - తెలంగాణ మధ్య, కృష్ణా - ఏలూరు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయేవి. అంతేకాక వెనకకు తన్నే వరద నీటితో ఏటి పరివాహక గ్రామాల్లోని వేలాది ఎకరాల వరి పంటలు నీట మునిగి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయేవారు. ప్రస్తుతం రూ. 100 కోట్లతో ఆధునిక వంతెన పనులు పట్టాలెక్కడం, అధికారులు భూసార పరీక్షలు, పిల్లర్ల మార్కింగ్ పనులను పర్యవేక్షిస్తుండటంతో ప్రయాణికులు, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.