BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ * తొలి రోజు 11 నామినేషన్లు దాఖలు *

Select Suryaa Now
ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ   * తొలి రోజు 11 నామినేషన్లు దాఖలు *

పాచిపెంట, సూర్య :  పాచిపెంట మండలంలో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగింది. బుధవారం నాడు ఉదయం 10:30 గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ తెలిపారు. 14 ఎంపీటీసీల సెగ్మెంట్లుకు సంబంధించి 11 నామినేషన్లు తొలిరోజు దాఖలైనట్లు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రమైన పాచిపెంట ఒకటవ సెగ్మెంట్ అన్ రిజర్వుడు కావడంతో వైసీపీ తరఫున డోల అనూష, డోల బాబ్జి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పాంచాలి,మాతమూరు సెగ్మెంట్లలో గూడెపు యుగంధర్ తనయురాలు, మోసూరు సెగ్మెంట్లో వైసీపీ నుంచి గండిపల్లి రాము, టిడిపి నుంచి వై గౌరీ శంకర్ నామినేషన్లు వేశారు. గుమ్మడగుడ సెగ్మెంట్ నుంచి ఎర్రజన్ని కన్నయ్య,గొట్టూరు సెగ్మెంట్ లో సిపిఎం నుంచి గెమ్మెల పైడితల్లి, పాచిపెంట 3వ సెగ్మెంట్ వైసీపీ నుంచి మజ్జి మౌనిక, టిడిపి నుంచి అంపోలు గౌతమి నామినేషన్ దాఖలు చేశారు. పనుకువలస సెగ్మెంట్ నుంచి చెల్లూరి హేమంత్ నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణ, ఎంపీడీవో బివిజె పాత్రో, తహసిల్దార్ రవి తెలిపారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ లాలం అర్జున్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి ప్రశాంతంగా జరిపించారు. గురు,శుక్రవారాల్లో నామినేషన్లు దాఖలు చేయవలసిన అభ్యర్థులు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఇంకొక విషయం ఏమిటంటే నామినేషన్ పత్రాలు నింపడంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎంపీడీవో ఆఫీసులో ఉపాధ్యాయుల బృందంతో కూడుకున్న  హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు దాదాపుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేకుండా నామినేషన్లు నింపుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

రిపోర్టర్ :  ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.