ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియో గించు కోండి గొడవలు పడితే తాటతీస్తాం అర్బన్ సీఐ రామకృష్ణ
బద్వేల్ మేజర్ న్యూస్.. కడప జిల్లా బద్వే ల్ మున్సిపాలిటీ పరిధిలోని 39 వ వార్డులో హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఓటరు తమ ఓటును ప్రశాంతముగా తమ తమ బూతులకు వెళ్లి వేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసామని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐ లు 6 మంది హెడ్ కానిస్టేబుల్ 30 మంది కానిస్టేబుల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రం సమీపంలో ఎలాంటి అల్లర్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపా రు. అదేవిధంగా ఎవరైనా తమ ఓటును వేసుకొని లేకుండా ఆటంకం కలిగించిన ఎడల ఎలక్షన్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తెలిపినచో వారి ఓటును స్వచ్ఛందంగా వేసుకునేందుకు అన్ని విధాల సహకరిస్తామని ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
రిపోర్టర్: రవికుమార్, ఇంచార్జ్ బద్వేల్, కడప జిల్లా