BREAKING
MPTC అభ్యర్థులకు అర్హత ధ్రువీకరణ పత్రాలు ఇవే! అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కీలక కదలికలు మరియు విశ్లేషణ సలూడా మెడికల్స్ షేర్లు రికార్డ్ స్థాయి పతనం అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ప్రజాస్వామ్యానికి వినాశకరమైనవి వందలాది సంస్థలను టార్గెట్ చేసిన సేఫ్‌పే రామ్‌సవేర్ ముఠా రేణిగుంటలో ఎడతెరిపి లేని వర్షం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహుల్లో గుబులు! రోబోటిక్ సర్జరీ వృద్ధి అంచనాల కోతతో పడిపోయిన షేర్లు విదేశీ కార్మికుల నియామకాల వివాదంపై అమెరికా ప్రభుత్వంతో సెటిల్‌మెంట్ న్యూజెర్సీ రిఫైనరీలో యూనియన్ కార్మికుల తొలగింపు మరియు లాకౌట్ బయోఫ్యూయెల్ నిబంధనలు సడలించాలని ఈయూను కోరిన నెస్ట్ ఆస్ట్రేలియా టెక్ మార్కెట్లో భారీ పతనం ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలి. ఎస్సై మహేష్. భారతదేశంలో తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లో బలహీనపడిన డాలర్ కార్ల ఉద్గారాల లక్ష్యాలను తగ్గించేందుకు ఈయూ చట్టసభ సభ్యుల ఒప్పందం

ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలి. ఎస్సై మహేష్.

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలి. ఎస్సై మహేష్.

కుందుర్పి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కుందుర్పి ఎస్సై మహేష్ సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. మండలంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అభ్యర్థులు సంయమనం పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడరాదని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని తెలిపారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, వాగ్వాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇతర అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థికి ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు అయినప్పటికీ, ఆ హక్కును వినియోగించుకునే సమయంలో చట్టాలు, ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ అనుచరులకు తగిన సూచనలు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైనవని, అవి ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, సంయమనం పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.