MPTC అభ్యర్థులకు అర్హత ధ్రువీకరణ పత్రాలు ఇవే!
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ (MPTC) స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గడువు ముగిసిన అనంతరం కార్యాలయ గేట్లు మూసివేస్తారని, పోటీ చేసే అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా తమ నామినేషన్లను దాఖలు చేయాలని సూచించారు.
నామినేషన్‌కు కావలసిన పత్రాలు / వివరాలు:
ఫారమ్ - 4 (Form-4): ఎంపీడీఓ (MPDO) కార్యాలయంలో లభిస్తుంది.
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు: 4 ప్రతిమలు.
ఆధార్ కార్డు: అసలు (Original) మరియు జిరాక్స్ ప్రతులు.
ఓటర్ ఐడీ: అసలు (Original) మరియు జిరాక్స్ ప్రతులు.
కులం ధ్రువీకరణ పత్రం (Caste Certificate)
నివాస ధ్రువీకరణ పత్రం (Residential Certificate)
విద్యార్హత సర్టిఫికెట్ (Education Certificate)
పార్టీ బి-ఫారమ్ (Party B-Form)
వయోపరిమితి: అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
పోలీస్ సర్టిఫికెట్: స్వయం ధ్రువీకరణ (Self-Declaration) పత్రం సమర్పించాలి.
నామినేషన్ రుసుము (MPDO ఆఫీస్‌లో చెల్లించాలి):
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు: ₹1,500/-
ఇతర వర్గాల వారికి: ₹3,000/-
ప్రతిపాదకులు: అభ్యర్థి పేరును ప్రతిపాదించే ఒకరు ఉండాలి.
ఆస్తుల వివరాలు: ఆస్తులకు సంబంధించిన డిక్లరేషన్ దాఖలు చేయాలి.
నో డ్యూస్ సర్టిఫికెట్: సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి బకాయిలు లేవని తెలిపే 'No Dues Certificate' సమర్పించాలి.
అభ్యర్థులందరూ ఈ నియమావళిని గమనించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత గడువులోగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం