BREAKING
పోలీసు సిబ్బంది సేవలు దేశానికి వెలకట్టలేనివని ప్రధాని మోదీ ప్రశంస వాల్‌స్ట్రీట్ బలమైన ఫలితాలతో దూసుకెళ్తున్న ఆసియా మార్కెట్లు పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ భాగస్వామిగా ఇజ్రాయెల్ గుర్తింపు వాకర్స్‌తో మమేకం.. నగరాభివృద్ధికి భరోసా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌ రూపాయి మారకం విలువలో స్వల్ప ఊపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: పెరుగుతున్న చైనా తప్పుడు సమాచార ప్రచారంపై భద్రతా ఏజెన్సీ హెచ్చరిక వైసీపీ సీనియర్ నేత సిద్ధగుంట సుధాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు. చర్యలపై వైసీపీ శ్రేణుల అభ్యంతరం. ఆయుర్వేదం, యోగాలలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సెషన్లు నిర్వహించిన బీఐఎస్ ప్రత్యేక స్వచ్ఛతా అభియాన్ 6.0 ఘన విజయం 5.7 బిలియన్ డాలర్లతో బ్రేజ్‌ను కొనుగోలు చేయనున్న సేల్స్‌ఫోర్స్: కస్టమర్ ఎంగేజ్‌మెంట్, ఏఐ మార్కెటింగ్‌లో సరికొత్త సంచలనం! పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమంటూ సీఎం యోగి నివాళి హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థి ఖరారుపై వీడని ఉత్కంఠ..! 200 మీటర్ల టీ12 విభాగంలో స్వర్ణం సాధించిన సిమ్రాన్, కాంస్యం కైవసం చేసుకున్న తేజల్బెన్ 135 బిలియన్ డాలర్ల మార్కెట్ సంక్షోభం: నెట్‌ఫ్లిక్స్‌ను గట్టెక్కించేందుకు భారీ బ్లాక్‌బస్టర్లు తప్పనిసరి.. తీవ్ర ఒత్తిడిలో ఓటీటీ దిగ్గజం!

హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థి ఖరారుపై వీడని ఉత్కంఠ..!

Select Suryaa Now
హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థి ఖరారుపై వీడని ఉత్కంఠ..!

హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థి ఖరారుపై వీడని ఉత్కంఠ..!

హొళగుంద, సూర్య ప్రతినిధి 
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జడ్పీటీసీ స్థానం కోసం టీడీపీ సీనియర్‌ నాయకుడు ఈడిగ గోవింద గౌడ్‌, ఎల్లార్తి గ్రామానికి చెందిన కురువ సామాజిక వర్గ నాయకుడు దర్గన్న పోటీ పడుతుండటంతో అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు జడ్పీటీసీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండటంతో ఈ అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా సర్వే నిర్వహించినట్లు సమాచారం.
ఈ సర్వేలో భాగంగా టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా ఎల్లార్తి దర్గన్నను కోరుకునే వారు ఒకటి నొక్కాలని, ఈడిగ గోవింద గౌడ్‌ను కోరుకునే వారు రెండు నొక్కాలని ఫోన్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. మండలంలోని పలువురికి ఈ ఫోన్‌ కాల్స్‌ వెళ్లడంతో అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది.
ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటిస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి

ఉమాపతి  సూర్య ప్రతినిధి హొళగుంద కర్నూలు జిల్లా