తాటియాకులగూడెం లో కూటమికి ఎదురుదెబ్బ వైఎస్సార్‌సీపీ లోకి భారీగా చేరికలు కూటమి ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత
జీలుగుమిల్లి, సూర్య న్యూస్ పోలవరం నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం పై విసుగు చెందిన ప్రజలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు నెరుసు నరేంద్ర ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు సందా ప్రసాద్, జిల్లా నాయకులు బోధ శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సొంత ధనార్జన కోసం పనిచేయడంతో పోలవరం నియోజవర్గంలో అధికార పార్టీ నుండి ప్రతి పక్షంలోకి ప్రజలు క్యూ కడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నూటొక్క రకాల హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి సర్కార్, అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.
*జగనన్న పాలనే మళ్లీ రావాలి:*
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలును, పేద ప్రజల సంక్షేమాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలకు ఆకర్షితులయ్యే తాటియాకులగూడెం లో కూటమి పార్టీల మోసాలను ఎండగడుతూ ఈ భారీ చేరికలు జరిగాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రిపోర్టర్: బొంతు రామకృష్ణ,,జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా