ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం పుట్టపర్తి రూరల్ ఎస్సైగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
పుట్టపర్తి రూరల్ ఎస్సైగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ
పుట్టపర్తి క్రైమ్ రిపోర్టర్ జీవన్ గణేష్
పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్ట చర్యలు చేపడతామన్నారు.గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, అల్లర్లకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటరమణ హెచ్చరించారు.