ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పిలుపు
వంగర, సూర్య: రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ప్రకృతి వ్యవసాయ
సిబ్బంది వేమి రెడ్డి పోలినాయుడు . రాగోలు రాణి అనసూర్య పిలుపునిచ్చారు శనివారం మడ్డువలస గ్రామంలో రసాయనాలు తయారుచేసి విరు రైతులతో మాట్లాడుతూ. రసాయన రహిత సాగు వల్ల నేల తల్లి ఆరోగ్యం కాపాడడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు అందుతాయని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో కషాయాలు.తయారీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించి చూపించారు. పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగుల నివారణకు స్థానికంగా లభించే వేపాకులు, గానుగాకులు, జిల్లేడు, వావిలాకు మరియు ఇతర రకాల చేదు ఆకులతో కషాయాలు ఏ విధంగా తయారుచేసుకోవాలో రైతులకు వివరించారు. మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయన పురుగుమందుల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ కషాయాల వల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.ప్రకృతి సిద్ధమైన కషాయాలు వాడకం వల్ల నేలలోని మిత్ర పురుగులు నాశనం కాకుండా పంటకు మేలు చేస్తాయి. అన్నారు "రైతులు సాంప్రదాయ పద్ధతుల నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మారాలి. ఇంట్లోనే లభించే ఆవు పేడ, ఆవు మూత్రం, వివిధ రకాల ఆకులతో కషాయాలు తయారు చేసుకుని వాడితే సాగు పెట్టుబడి తగ్గి, దిగుబడి నాణ్యత పెరుగుతుంది. ప్రతి రైతు కూడా తమ పొలంలో కొంత భాగంలోనైనా ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేయాలని వారు కోరారు.