ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం ఓటు హక్కు ఓట్ చోరి వద్దు.. బ్యాలెట్ పేపర్లే ముద్దు కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం ఓటు హక్కు
ఓట్ చోరి వద్దు.. బ్యాలెట్ పేపర్లే ముద్దు
కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా బ్రహ్మాస్త్రమనే ఓటు హక్కు అందించారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు అన్నారు. ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 66వ డివిజన్లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా జరిగాయని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలీసు పటిష్ట బందోబస్తు నడుమ అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారని అభినందించారు. ఈ ఎన్నికలు గత పాలకుల అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు ముగింపు పలుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిందన్నారు. పార్లమెంట్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాజ్యాంగం పౌరుడికి కల్పించిన ఓటు హక్కును కాపాడేలా జరుగుతున్న ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోందన్నారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఓట్ చోరీ చేసినవారు అందుకు సహకరించిన వారు ప్రజలముందు దోషులుగా నిలబడక తప్పదన్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి