ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఫర్నిచర్ వితరణ రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. వైద్య సేవలకు చేయూత
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ :ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తన వంతు సహకారాన్ని అందించింది. సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేసింది. ప్రభుత్వ వైద్య రంగానికి ప్రైవేటు వైద్య సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 10 ఆఫీస్ టేబుల్స్, 100 ప్లాస్టిక్ చైర్లు 15 కుషన్ చైర్స్, 6 ఆఫీస్ చైర్స్, 2 బీరువాలను వితరణగా అందించింది. మొత్తం రూ.3 లక్షల విలువైన ఈ ఫర్నిచర్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి కి యాజమాన్య ప్రతినిధులు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తమ వంతు బాధ్యతగా ఈ ఫర్నిచర్‌ను అందజేసినట్లు తెలిపింది.
ఈ కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ జి .రామకృష్ణారెడ్డి డాక్టర్ జి. స్వరూప్ రెడ్డి డాక్టర్ ఎం అశ్వర్థ రెడ్డి ఎస్ రాజీవ్ రెడ్డి శ్రీహరి తో పాటు ఆసుపత్రి యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేటు వైద్య సంస్థలు అందిస్తున్న ఇటువంటి సహకారం వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింత ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.