ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత..
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ :ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తన వంతు సహకారాన్ని అందించింది. సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేసింది. ప్రభుత్వ వైద్య రంగానికి ప్రైవేటు వైద్య సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 10 ఆఫీస్ టేబుల్స్, 15 కుషన్ చైర్స్, 6 ఆఫీస్ చైర్స్, 2 బీరువాలను వితరణగా అందించింది. మొత్తం రూ.3 లక్షల విలువైన ఈ ఫర్నిచర్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి కి యాజమాన్య ప్రతినిధులు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తమ వంతు బాధ్యతగా ఈ ఫర్నిచర్‌ను అందజేసినట్లు తెలిపింది.ఈ కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి వైద్యులు స్వరూప రెడ్డి, అశ్వర్థ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, నిఖిల్ రెడ్డితో పాటు ఆసుపత్రి యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.