BREAKING
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమా స్పై జోనర్ ప్రమాణాలను మార్చేసింది: నటి నిమ్రత్ కౌర్ ప్రశంసలు రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు

అనంతపురం బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యంగా ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు.

బుధవారం ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్ ప్రాంతంలో మున్సిపల్ ప్రైమరీ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భగత్ సింగ్, అల్లూరి విద్యా వికాసం కేంద్రాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, అభ్యసన విధానం, విద్యా కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

హరీష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ధర్మవరం అర్బన్, రూరల్‌తో పాటు బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 30 ఉచిత విద్యా వికాసం కేంద్రాలను ఏర్పాటు చేసి, 30 మంది స్థానిక ట్యూటర్ల ద్వారా 843 మంది విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అలాగే నియోజకవర్గంలోని 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా వాహిని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని హరీష్ బాబు పేర్కొన్నారు.