ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గా రాంబాబు
రాజమహేంద్రవరం సిటీ :
రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు గారు మంగళవారం తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, సూపరింటెండెంట్ రాంబాబు గారు ఆసుపత్రిలోని వైద్య సేవలు, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.