BREAKING
మహిళా జర్నలిస్టుల వేధింపుల ఆరోపణల దుమారం భాగ్యనగర్ జిల్లా BJYM అధికార ప్రతినిధిగా ఎం.సందీప్ సాగర్ వర్షాల కురవాలి ప్రజల సంతోషంగా ఉండాలి. గొట్టిపాటి లక్ష్మి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అపూర్వ వారసత్వానికి 146 ఏళ్లు: ఘనంగా ఉత్సవాలు నిర్వహించిన ఎన్‌ఎఫ్‌ఆర్ క్రిప్టో మార్కెట్‌పై అమెరికా మరింత నిఘా: లెవరేజ్డ్ ట్రేడింగ్ కోసం నూతన నిబంధనలను ప్రతిపాదించిన సీఎఫ్‌టీసీ! ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు ఈశ్వర్‌కు ఆహ్వానం మోదీకి సంఘీభావంగా సేవా జ్యోతి యాత్ర గగనతల ఆంక్షలు, ఇంధన ధరల భారం ఉన్నా తగ్గని జోరు: భారత మార్కెట్‌పై భారీగా పందెం కాస్తున్న గల్ఫ్ ఎయిర్‌లైన్స్! గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురు పట్టివేత…! ప్రొద్దుటూరు డీఎస్పీగా ఈ. బాలస్వామిరెడ్డి మార్కెట్‌యార్డ్‌, రైతుబజార్‌ అభివృద్ధికి రూ.2.62 కోట్లు ఫుట్ వాక్ పై పచారి కోట్లు,కొనుగోలు దారులకు పొంచి ఉన్న ప్రమాదం శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపం, సహస్రఘటాభిషేకం . ఎల్లనాటి నిరీక్షణకు తెర …. 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ ఆర్టిఐ లోనే అధికార గందరగోళం! ఇద్దరు ఎంఈఓలు ఉండగా హెచ్ఎం కు సహాయ పౌర సమాచార అధికారి బాధ్యతలు ఎందుకు?

చాయ్ వాలా సుధాకర్ మృతి

Select Suryaa Now
చాయ్ వాలా సుధాకర్ మృతి

సూర్య,భీమ్‌గల్:కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆత్మహత్య యత్నం చేసిన సుధాకర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భీమ్‌గల్ పట్టణంకు చెందిన పొలాస సుధాకర్  స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలం లో సుధాకర్ పై పోలీస్ లు అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచుతున్నారు అని ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్ రావాలని సమాచారం ఇచ్చారు. సోమవారం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన సుధాకర్ కు కేస్ విషయం కోర్ట్ కు వెళ్లాలని సూచించారు పోలీసులు, దానితో మనస్తపం చెందిన సుధాకర్ తనతో పాటు ప్లాస్టిక్ బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ పిఎస్ ఆవరణలో  పెట్రోల్ పోసుకొని నిప్పoటించుకొని ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసింది. స్థానికులు మంటలను అర్పి ఆసుపత్రి కి తరలించారు. తీవ్ర గాయాలు అయినా సుధాకర్ ను ముందుగా జిజిహెచ్ నిజామాబాద్ కు అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిoచారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఈ ఘటనలో సుధాకర్ తన అత్మహత్య కు కారణం స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి తో పోలీస్ లు కేసులు పెట్టి వేడిస్తున్నారు అని తెలిపారు. కానీ ఆసుపత్రి లో సుధాకర్ మరో విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానితో ఈకేసులో పోలీస్ వేధింపులు కారణం కాదు అని సీపీ ప్రకటన జారీ చేసారు. బాల్కొండ ఏమ్మెల్యే  వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం పోలీస్ వేధింపులు కారణం గా సుధాకర్ ఆత్మహత్య యత్నం చేశాడు అని ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ తిరుపతి పై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు. మంగళవారం భీమ్‌గల్ బంద్ కు పిలుపు నిచ్చారు.ఈ నేపథ్యంలో భీమ్‌గల్
లో బంద్ ప్రశాంతగా విజయవంతంగా సాగుతోంది. వ్యాపారస్థులందరు స్వచ్చందంగా తమ తమ దుకాణాలను మూసి ఉంచి సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్టు

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పొలాస సుధాకర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సుధాకర్ మృతి చెందడంతో ఆయనకు నివాళులర్పించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు సమాచారం. భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం పొలాస సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత ఆర్మూర్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఘటనకు పోలీసుల వేధింపులే కారణమని సుధాకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసుల వైపు తప్పిదం లేదని నిజామాబాద్ సీపీ పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. సుధాకర్ ఆత్మహత్యాయత్నం అనంతరం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ఎస్సై తిరుపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరడంతో పాటు, భీంగల్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. సుధాకర్ మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.