BREAKING
ఎల్లనాటి నిరీక్షణకు తెర …. 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ ఆర్టిఐ లోనే అధికార గందరగోళం! ఇద్దరు ఎంఈఓలు ఉండగా హెచ్ఎం కు సహాయ పౌర సమాచార అధికారి బాధ్యతలు ఎందుకు? ఇంద్రానగర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు జూనియర్ కళాశాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలి ఏజెన్సీలో ఆరోగ్య ప్రదాత.. వైద్య సేవల్లో రుక్మాకార్ రెడ్డి సేవలు అమోఘం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతిపత్రం నగరికల్లు మండలంలో విద్యుత్ కోత బాలల దినోత్సవ పోటీలను నిర్వహించనున్న ఎస్.ఎన్.జి.ఎస్ సింగరకొండ అంజన్న క్షేత్రంలో వరుణ యాగం. మినీ క్రీడా మైదానం, సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం చేయాలి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం... బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు బస్సు సౌకర్యం లేక అగర్‌గూడ విద్యార్థుల అవస్థలు

బ్రాండ్ అంబాసిడర్ కు సన్మానం

Select Suryaa Now
బ్రాండ్ అంబాసిడర్ కు సన్మానం

స్వచ్ఛ అంబాసిడర్ జయలక్ష్మికి విక్కుర్తి సత్కారం
అవనిగడ్డ, అక్టోబర్ 6 మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డుల్లో స్వచ్ఛ అంబాసిడర్ అవార్డు అందుకున్న చల్లపల్లి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు జయలక్ష్మిని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలవగా, దుశ్శాలువాతో సత్కరించి చీరను బహూకరించారు.
విజయవాడలో జరిగిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయలక్ష్మిని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రత్యేకంగా అభినందించి అవార్డు, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనను గౌరవించడం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి అని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో గతంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చగలిగామని పేర్కొన్నారు.

-అజంతా శ్రీను