BREAKING
బాలల దినోత్సవ పోటీలను నిర్వహించనున్న ఎస్.ఎన్.జి.ఎస్ సింగరకొండ అంజన్న క్షేత్రంలో వరుణ యాగం. మినీ క్రీడా మైదానం, సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం చేయాలి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం... బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు బస్సు సౌకర్యం లేక అగర్‌గూడ విద్యార్థుల అవస్థలు ఎల్లూర్ పాఠశాలలో వసతుల కొరత క్షణికావేశంలో భర్తను హతమార్చిన భార్య, కొడుకు! చాయ్ వాలా సుధాకర్ మృతి ఉచిత యూజర్లకు గూగుల్ షాక్: జెమిని ఏఐపై పేవాల్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు బీసీ జనసేన ఘన సత్కారం గాల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో తీవ్ర సంక్షోభం: మార్కెట్లో మారికో భారీ డీల్:

దంత వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

Select Suryaa Now
దంత వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

 

రాజమహేంద్రవరం :

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఏ) ప్రతినిధులు మంగళవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దంత వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో నోటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దంత వైద్యుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఉపాధి అవకాశాలు అందుకు అనుగుణంగా లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దంత వైద్యులు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో దంత వైద్య సేవల కొరత ఉండటం వంటి సమస్యలను ఐడిఏ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి పి హెచ్ సిలో దంత వైద్యుడి నియామకం, గ్రామీణ ప్రాంతాల్లో నోటి ఆరోగ్య సేవల విస్తరణ, హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల్లో నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దంత విభాగాల బలోపేతం వంటి పలు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. అదేవిధంగా “బాల దంత సంరక్షణ”, “గ్రామ దంత సంజీవిని” వంటి కార్యక్రమాలను అమలు చేయాలని, దంత క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌కు సింగిల్ విండో విధానం తీసుకురావాలని, ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా దంత వైద్యుల సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.