ఎల్లూర్ పాఠశాలలో వసతుల కొరత
పెంచికల్‌పేట్, సూర్య:
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని’ అన్న చందంగా ఎల్లూర్ ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి నెలకొంది. విద్యాబోధన బాగున్నా కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన వంటగది ఇప్పటికీ వినియోగంలోకి రాక తాళం వేసి ఉంది. మరోవైపు మరుగుదొడ్లు ఉన్నా తలుపులు లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి వంటగదిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.