BREAKING
నగరికల్లు మండలంలో విద్యుత్ కోత బాలల దినోత్సవ పోటీలను నిర్వహించనున్న ఎస్.ఎన్.జి.ఎస్ సింగరకొండ అంజన్న క్షేత్రంలో వరుణ యాగం. మినీ క్రీడా మైదానం, సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం చేయాలి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం... బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు బస్సు సౌకర్యం లేక అగర్‌గూడ విద్యార్థుల అవస్థలు ఎల్లూర్ పాఠశాలలో వసతుల కొరత క్షణికావేశంలో భర్తను హతమార్చిన భార్య, కొడుకు! చాయ్ వాలా సుధాకర్ మృతి ఉచిత యూజర్లకు గూగుల్ షాక్: జెమిని ఏఐపై పేవాల్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు బీసీ జనసేన ఘన సత్కారం గాల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో తీవ్ర సంక్షోభం:

ఒకే సమన్వయంతో జిల్లా యంత్రాంగం! ఏర్పాట్లపై కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణ

Select Suryaa Now
ఒకే సమన్వయంతో జిల్లా యంత్రాంగం! ఏర్పాట్లపై కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణ

ఒకే సమన్వయంతో జిల్లా యంత్రాంగం

డిప్యూటీ సీఎం పర్యటనపై కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ ప్రత్యేక పర్యవేక్షణ

క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్నీ పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం

ఐటీడీఏ పీవో, ఎస్పీ, సబ్ కలెక్టర్‌తో కలిసి సభా స్థలం పరిశీలన

8న పోలవరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

వేములకొండలో రోడ్డుకు శంకుస్థాపన.. రాకోటలో గిరిజనులతో మమేకం

రంపచోడవరం సూర్యప్రతినిధి  , అక్టోబరు 6 
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 8న చేపట్టనున్న పోలవరం జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్నీ పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులతో కలిసి కార్యక్రమ ప్రాంతాలను పరిశీలిస్తూ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు.

కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో, ఎస్పీ, సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నారు.

పర్యటనలో భాగంగా వేములకొండ పంచాయతీలో పక్కా రోడ్డు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాకోట గ్రామానికి వెళ్లి స్థానిక గిరిజనులతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు.

తదుపరి నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అధికారులతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుర్ల రాజశేఖర్‌రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం పర్యటనను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను కొనసాగిస్తోంది.