andhrapradesh
పొన్నూరులో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
పొన్నూరు పట్టణం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సూచనల మేరకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ముందుగా వారు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతూ మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా భారత మాజీ రాష్ట్రపతి, రక్షణ పరిశోధన రంగంలో విశిష్ట సేవలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారుఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్, పట్టణ ఉపాధ్యక్షురాలు శ్యామల , స్టేట్ మైనారిటీ కమిషన్ సభ్యులు షేక్ సైఫుల్లా , పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ పేరు సాహెబ్ , మండల అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ , స్టేట్ కార్మిక విభాగం కార్యదర్శి వట్టిప్రోలు రంగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యందేటి వెంకటసుబ్బయ్య , జిల్లా రైతు విభాగం కార్యదర్శి బోయిన నాగరాజు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు , పట్టణ బూత్ కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి వాసు, పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు మిక్కిలి జాన్ , పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పలగాని రమేష్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్